పెద్దపల్లి అక్టోబర్ 11
:
సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ పా , పి.పి అండ్ ఫైనాన్స్ ఎన్.బలరామ్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు అన్ని ఏరియాల జియంలతో ఉత్పత్తి, ఉత్పాదకత, కోవిడ్ వ్యాక్సినేషన్ పై చేపట్ట వలసిన (పాణళికల గురించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించటం జరిగింది. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏరియాల వారీగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతకు చేపట్ట వలసిన ప్రణాళికలు, నష్టాన్ని తీర్చుటకు తీసుకోవలసిన జాగ్రత్త చర్యలు, బొగ్గు రవాణాకు సంబందించిన ఏర్పాట్లు, ఉపరితల మరియు అండర్ (గౌండ్ గనులలో యం(తాల వినియోగం, వాటి పనితీరు, అదే విధంగా గనులు మరియు డిపార్ట్ మెంట్ లలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కు సంబందించిన వివరాలు, ఇప్పటి వరకు చేపట్టిన వ్యాక్సినేషన్ మొదటి, రెండవ డోస్ వివరాలు ఏరియాల వారీగా కోవిడ్ టెస్ట్ ల వివరాలు, ప్రస్తుతం నమోదు అవుతున్న పాజిటివ్ కేసుల వివరాలు తదితర విషయాల గురించి చర్చించటం జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్జి 1 ఏరియా జియం కె.నారాయణ, డీజీఎం పర్సనల్ లక్ష్మి నారాయణ, డివైసిఏంఓ . డా.కిరణ్ రాజ్ కుమార్, మేడిపల్లి ఒపెన్ కాస్ట్ ఆక్టింగ్ పి.ఓ సలీం, హెల్త్ ఆఫీసర్ సుమన్ పాల్గొన్నారు