జగిత్యాల అక్టోబర్ 16
విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని, జిల్లా అన్ని రంగాలలో అగ్రభాగంలో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు.
శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ గారు ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో ప్రతి స్థాయిలోని అధికారి ప్రజా రక్షణలో ముందుంటూ మన్ననలు అందుకుంటూ పోలీస్ శాఖ గౌరవం మరింత పెరిగేలా పని చేయాలన్నారు. అనంతరం ఎం.టి. విభాగం వద్ద వాహనాల పూజ నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు.
పూజా కార్యక్రమాలలో డిఎస్పీ ప్రకాష్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు వమనమూర్తి, నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.