హైదరాబాద్
రాష్ట్ర ప్రజలకు రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ దసరా ప్రతి ఇంట్లో సంతోషం నింపాలని,అష్ట ఐశ్వర్యాలతో విరాజిల్లాలని,ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పాడి పంటలతో రైతులు సుభిక్షంగా వర్ధిల్లాలని దుర్గా మాతను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రజలందరు సంతోషంగా దసరా పండుగ జరుపుకోవాలని కోరారు.