చిల్లకూరు పోలీసులు రంగప్రవేశం
అనుమానితుడు ని స్టేషన్ కి తరలింపు
నెల్లూరు
నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పారిచెర్లవారిపాలెం లో చోరీలకు పాల్పడుతున్నాడన్న అనుమానంతో ఓ యువకుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేసిన ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ ఇంట్లో చొరబడి చోరీకి ప్రయత్నించగా ఆ ఇంటి యజమాని ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ఇంటి యజమాని గాయాలయ్యాయి. ఎట్టకేలకు అనుమానాస్పదంగా ఉన్న యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఇటీవల కాలంలో గ్రామంలో వరుస చోరీలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ గ్రామానికి చెందిన ఓ దుకాణం లో ఇటీవల చోరీ జరిగి సెల్ ఫోను నగదు కూడా చోరీకి గురైంది. యువకుడికి దేహశుద్ధి చేసిన విషయం పోలీసులకు సమాచారం అందడంతో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన యువకుడు మరో ముగ్గురు యువకుల పేర్లు కూడా చోరీలకు పాల్పడే వారి జాబితాలో పోలీసులకు చెప్పినట్లు సమాచారం.