Home తెలంగాణ అంతర్జాతీయ అవార్డు కు వినోద్ కుమార్ ఎంపిక

అంతర్జాతీయ అవార్డు కు వినోద్ కుమార్ ఎంపిక

106
0

సిగ్మా అకాడమీ అఫ్ ఫోటోగ్రఫీ – హైదరాబాద్ మరియు సాలార్ జంగ్ మ్యూజియం – మినిస్ట్రీ అఫ్ కల్చర్ , భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో 2021  సంవత్సరానికి  ఫోటోగ్రఫీలో ప్రతిభ కనపరిచిన వారికి ఇచ్చే అవార్డులకు కోరుట్లకు చెందిన చలిగంటి వినోద్ కుమార్  ఎంపిక అయ్యాడు.శుక్రవారం సాలార్ జంగ్ మ్యూజియంలో అంతర్జాతీయ  అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాలార్ జంగ్  మ్యూజియం డైరెక్టర్ ఏ .నాగేందర్ రెడ్డి హజరైఫోటో గ్రాఫర్ వినోద్ కు అవార్డును  ప్రధానం చేశారు ..వినోద్ పంపిన తెలంగాణ  కల్చర్ కు సంబంధించిన ఫోటోల ప్యానల్ ను ఎంపిక చేశారు.ఈ కార్యాక్రమంలో సిగ్మా అకాడమీ చెర్మన్ ఎం.సి.శేఖర్ , డైరెక్టర్ కే.జనార్దన్ , మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ వీరేందర్, జె ఎన్ టియూ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.భారత దేశం నుండి 38  మంది ప్రతిభ మూర్తులను ఎంపిక చేశామని అకాడమీ చైర్మన్ తెలిపారు.

Previous articleపెన్నా వంతెన బ్రిడ్జి సింహపురి ప్రజలకు అందుబాటులోకి వచ్చేనా జనసేన నాయకులు ఆందోళన
Next articleనవనీత సేవలో భ‌క్తుల‌కు అవ‌కాశం సెప్టెంబరు 13వ తేదీ నుండి భక్తులకు అందుబాటులోకి అగరబత్తులు డయల్‌ యువర్‌ ఈవోలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here