కాకినాడ
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్న వారిని స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన కాకినాడ కార్పొరేషన్ 16 వ డివిజన్ ఉప ఎన్నికల్లో సోమవారం చోటు చేసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి 16 వ డివిజన్లో దొంగ ఓట్లు వేయిస్తున్న వైకాపా నాయకులను స్థానిక ప్రజలు నిలదీశారు. దీంతో కొంత సేపు స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది.