నెల్లూరు
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని కల్లూరుపల్లి ఇందిరమ్మ కాలనీలోని కల్యాణం వెంకటయ్య గుండె పోటుతో శుక్రవారం మరణించడం జరిగింది.అందులో భాగంగా వైస్సార్ బీమా పథకం ఆపద్బాంధవుడు లాగా అ ఆ కుటుంబాన్ని ఆదుకుంది. మృతుని ఎత్తుబడి కార్యక్రమానికి 10వేలు రూపాయల నగదు మృతుని భార్య అంకమ్మకు వైస్సార్సీపీ 25వ డివిజన్ ఇంచార్జీ ఆరవ శ్రీనివాసులు,వెల్ఫేర్ డెవెలప్మెంట్ సెక్రటరీ షేక్ షబ్బీర్ శుక్రవారం అం అం అందించారు.ఈ సందర్భంగా 25వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు ఆరవ శ్రీనువాసులు మాట్లాడుతూ వైస్సార్ బీమా నిరుపేద పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఆపద సమయంలో ఆర్థికంగా నేనున్నానంటూ ఆసరా ఇచ్చిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల లో భాగంగా వైఎస్ఆర్ బీమా ఏర్పాటు చేయబడిందని, అందులో భాగంగానే అనేక కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించిందని రాష్ట్ర ప్రభుత్వ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాలేంటీర్లు జ్యోతి,ప్రవళిక,భారతి తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న వైయస్సార్ బీమా మృతుని కుటుంబానికి 10వేల నగదు చెల్లించిన...