కామారెడ్డి సెప్టెంబర్ 14
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గత మూడు రోజులుగా ఓ చిరుతపులి గ్రామ శివారు ప్రాంతాలలో సంచరిస్తూ పలువురి కంటపడింది. దీంతో వారు పోలీసులకు సమాచారం
అందించడంతో వారు అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో పులి అడుగులను గుర్తించి చిరుత పులి సంచరిస్తుంది ఇది నిజమేనని తేల్చారు. ఇది ఇలా ఉండగా గత రెండు
రోజులుగా కేవలం ఒక చిరుత సంచరిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ మంగళవారం మండల కేంద్రంలోని మల్లాపూర్ గ్రామం వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో గల పంటపొలాల్లో
రెండు చిరుతపులులు సంచరించడం పలువురు గమనించారు. వెంటనే అటవీశాఖ అధికారులు సైతం అక్కడికి చేరుకొని పులి అడుగులను గమనించి రెండు చిరుతపులులు శివారు ప్రాంతాల్లో
సంచరిస్తూ ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులుల సంచారం తో మండల కేంద్ర ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు.