హైదరాబాద్ అక్టోబర్ 7
శాసనసభలో పల్లె ప్రగతి పై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. వక్ఫ్ బోర్డు భూముల విచారణకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సమస్యలపై మొన్న మాట్లాడారు. పేదలకు న్యాయం చేయాలని కోరారు. తప్పకుండా ప్రభుత్వ సానుకూలంగా ఉందన్నారు. వక్ఫ్ బోర్డు భూముల మీద విచారణ జరిపించాలి అంటున్నారు. తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వంలో రికార్డుల ఆధారంగా దేవాదాయ, వక్ఫ్ బోర్డులు ఫ్రీజ్ అయ్యాయి. గవర్నమెంట్ పరంగా వాటిని ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్లు చేయడం జరగదన్నారు. కొన్ని సందర్భాల్లో కోర్టుల్లో మన వారు సరిగా వాదించడం లేదని అక్బరుద్దీన్ ఓవైసీ అంటున్నారు. వక్ఫ్ బోర్డుల విషయంలో జరిగిన దారుణాలపై సీబీసీఐడీ విచారణకు ఇవాళే ఆదేశిస్తాను అని సీఎం కేసీఆర్ తెలిపారు