నెల్లూరు జిల్లా సంగం చెక్ పోస్ట్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. ఎదురుగా వస్తున్న బైక్ ను తప్పించబోయిన సిమెంట్ ట్యాంకర్ రెండుగా ముక్కలయింది. బైక్ ను గమనించిన డ్రైవర్ ట్యాంకర్ ను ఒక్కసారిగా పక్కకు తిప్పాడు. దాంతో ట్యాంకర్ వాహనం రెండు భాగాలుగా విడిపోయింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. ద్విచక్రవాహనదారుడు తప్పించుకున్నారు. కాకపోతే ప్రమాద దృశ్యం చాలా తీవ్రంగా ఉంది. ..