కరీంనగర్ అక్టోబర్ 16
నిన్న దసరా ఉత్సవాల లో మిడ్ మానేరు నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు బోయినిపల్లి మండలం నీలోజీపల్లి గ్రామ మాజీ సర్పంచ్ కూస రవి పై టిఆర్ఎస్ గుండాల దాడిని ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు
శనివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కూస రవిని పరామర్శించి జరిగిన దాడి ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ లో ప్రజాస్వామిక పరిపాలన జరగడం లేదని టిఆర్ఎస్ అరాచక పాలన కోనసాగుతోందని ఆరోపించారు.
ఇసుక అక్రమ రవాణాపై పోరాటం చేస్తున్నందుకు
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ రావు మరియు అతని తండ్రి జోగినపల్లి రవీందర్రావు
ప్రోద్బలంతో కాంగ్రెస్ నాయకులపై టిఆర్ఎస్ మూకలు దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులకు పూనుకుంటే టిఆర్ఎస్ మంత్రులు.. ఎమ్మెల్యే లు కార్యకర్తలు ఎవరు కూడా బయట తిరిగే లేరని హెచ్చరించారు. ఆయన వెంట మిడ్ మానేరు భూ నిర్వాసితుల పోరాట సమితి నాయకులు పిల్లి కనకయ్య, కోడిముంజ సర్పంచ్
కదెర రాజు,సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు జలగం ప్రవీణ్ కుమార్ ( టోని) చిలివేరి శ్రీనివాస్ గౌడ్ ,యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం మధుకర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు