నిర్మల్,
లక్ష్మణ్ చందా పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న శేరాల రాము తేది.30.03.2021 రోజున అనారోగ్యంతో మరణించగా అతని భార్య ఎస్.సంగీత కు భద్రత ఎక్సగ్రేషియా నుండి (4) లక్షల రూపాయల చెక్ ను ఈ రోజు జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ రాము కుటుంబ ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని ఎస్పీ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీఐ రమేష్, ఎస్పీ సిసి వెంకట రమణ, పోలీస్ సంఘ అద్యక్షుడు విరాసత్ అలీ, రాము భార్య సంగీత, కుమారులు పాల్గొన్నారు.