Home తెలంగాణ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగు జాడల్లో మనమంతా నాడవాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగు జాడల్లో మనమంతా నాడవాలి

267
0

జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల,సెప్టెంబర్ 27
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అడుగు జాడల్లో మనమంతా నాడవాలని జిల్లా కలెక్టర్ జి.రవి  అన్నారు.  సోమవారం రోజున  కొండా లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి పురస్కరించుకుని స్థానిక ఐ.ఎం.ఏ హల్ నందు ప్రజలు, జిల్లా అధికారులతో   కలిసి కోండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.  కొండా లక్ష్మణ్ బాపూజీ సెప్టంబర్ 27,1915న  ప్రస్తుత్త ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకెడి గ్రామంలో జన్మించారని తెలిపారు. కోండా లక్ష్మణ్ బాపూజీ  భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలోని  క్వీట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గోన్నారని అన్నారు. నిజాం రజాకార్లు చేస్తున్న దురాగతాలకు  వ్యతిరేకంగా  పొరాటం చేసారని,నగర పౌర హక్కుల కోసం ఉద్యమించారని, వాటి సాధనకు కమీటిలు ఏర్పాటు చేసారని, మొట్టమొదటి సారిగా 1952లో ఆయన ఆసిఫాబాద్  శాసనసభ్యుడుగా ఎన్నికయ్యారు, అప్పుడు జరిగిన నాన్ ముల్కి ఉద్యమంలో చురుకుగా పాల్గోన్నారని, 1957-60 మధ్య డిప్యూటి స్పీకర్ గా పని చేసారని, ఆయన రెండు సార్లు మంత్రి పదవిని అలంకరీంచారు,మొత్తం 17 ఏళ్లు శాసనసభ్యుడు గా బాధ్యతలు వ్యవహిరించారని, దామోదరం సంజీవయ్య కేబినేట్ లో చేనెత, లఘు పరిశ్రమలు, అభ్కారి శాఖ మంత్రి గా పని చేసారని,1969 లో జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజి చురుకుగా పాల్గోన్నారని అన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గోనటం కోసం తన మంత్రి పదవిని కూడా రాజినామా చేసారని, ఉద్యమంలో మొదటి రాజీనామా కోండా లక్ష్మణ్  బాపూజీ చేసారని,  ఇటివల జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఆయన తన వంతు కృషి చేసారని తెలిపారు. 97 ఏళ్ల వయస్సులో  ఢిల్లీ లో జంతర్ మంతర్ వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనకై నిరహర దీక్ష చేసారని, ఆయన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనకు మరియు బడగు బలహిన వర్గాలు  అభివృద్ది చేందాలని ఆశించారని అన్నారు.  ఆచార్య కోండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు అనుగుణంగా మనమంతా కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్, ఆర్.డి.ఓ మాధురి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సాయి బాబ ,వివిధ శాఖ జిల్లా అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Previous articleబడుగు బలహీన వర్గాల స్పూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ
Next articleదిశ’నిందితుల ఎన్‌కౌంటర్‌పై సజ్జనార్‌ ను విచారించనున్న సిర్పుర్‌ కమిషన్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here