విశాఖపట్నం, అక్టోబర్16
జీవిత చరమాంకంలో యెవరు తమ తల్లిదండ్రులను,వృద్ధులను పట్టించుకోకుండా వదిలేస్తారో వారే నిజమైన అనాథలని సింహచలం దేవస్ధానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు, జాతీయ జర్నలిస్టుల సంఘం ప్రధాన కార్యదర్శి ,గంట్ల శ్రీనుబాబు అన్నారు. విజయదశమి పర్వదినం నేపథ్యంలో పాతనగరంలో ఉన్న వివేకానంద అనాధ,వృద్ధుల ఆశ్రమంలో శ్రీనుబాబు కుటుంబ సభ్యులు శనివారం అన్నదానం,వస్త్రదానం, పండ్ల దానం చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ అనాథలకు అండగా ఉండాల్సిందేనని ఆకాంక్షించారు,. ఇక్కడి వివేకానంద సంస్థకు ప్రతి ఏటా తన వంతుగా లక్ష రూపాయాలు అన్నదానం కోసం విరాళం అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో పాటు, వృద్దులకు అవసరమైన మంచాలు, బెడ్‌షీట్లు అందజేస్తున్నామన్నారు. ఇటీవలే తన చేతుల మీదుగా రూ.25వేలతో కొనుగోలు చేసిన గోమాతను అందజేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలుకు సంస్థ సభ్యులకు కార్యక్రమంలో నూతన వస్త్రాలు.. దుప్పట్లు.. పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, సభ్యులు సోంబాబు తదితరులు పాల్గొన్నారు.
———కార్మిక నాయకునికి ఘన నివాళి
విశాఖ పోర్టు ట్రస్టులో సుధీర్ఘకాలం పాటు సేవలందించిన లేబర్ కార్మిక నాయకుడు ముక్క అప్పలనాయుడువర్ధంతి సందర్భంగా ఆయన జ్ఙాపకార్థం పలుసేవా కార్యక్రమాలు చేపట్టారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లుర్పించారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు గోపి,రాము,కృష్ణరావు, ప్రణిత్, హనీష ..హర్ష,శ్రీజ తదితరులు పాల్గొన్నారు.