Home తెలంగాణ ఆరోగ్య కార్యకర్తల కు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఆరోగ్య కార్యకర్త పై...

ఆరోగ్య కార్యకర్తల కు అన్ని విధాలుగా అండగా ఉంటాం ఆరోగ్య కార్యకర్త పై దాడి చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం వంద శాతం వాక్సినేషన్ లక్ష్య సాధనకు కృషి చేయాలి ఉత్తునూర్ పి హెచ్ సి సందర్శించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

105
0

కామారెడ్డి నవంబర్ 11

కామారెడ్డి జిల్లాలో
ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం ఉత్తునూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్  జితేష్ వి పాటిల్ సందర్శించారు. పెద్ద పోతంగల్ ఆరోగ్య కార్యకర్త సావిత్రి పై దాడి జరిగిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ చేయడానికి వెళితే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త సావిత్రి తెలిపారు.ఆమెను పరామర్శించారు.దాడులకు భయపడవలసిన అవసరం లేదని సూచించారు. దాడి చేసిన వ్యక్తుల పై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు , అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయవ్వ, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్ర రావు, ఉప సర్పంచ్ శివ పాటిల్, వైద్యాధికారి హరికృష్ణ, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ శోభారాణి, పంచాయతీ కార్యదర్శి దేవి సింగ్ ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Previous article-జాతీయ స‌గ‌టును మించి రాష్ట్రంలో వ్యాక్సినేష‌న్ వ్యాక్సినేష‌న్ వేగం మ‌రింత పెంచాల‌ని మంత్రి హ‌రీష్ రావు ఆదేశం – శ‌నివారం జిల్లా క‌లెక్ట‌ర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యం
Next articleజిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ధర్నా త్వరిత గతిన వడ్ల కొనుగోలు పూర్తి చేయాలి బిజెపి జిల్లా అధ్యక్షులు అరుణతార

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here