కడప
ఉప ఎన్నికల్లో మాదే విజయం అంటున్నారు బిజెపి నేతలు కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ ఉప ఎన్నికలలో జోరు పెంచిన భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తాం అంటున్న భారతీయ జనతా పార్టీ నేతలు ఈరోజు ఉదయం భారతీయ జనతాపార్టీ బద్వేల్ ఆఫీసులో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సి ఆదినారాయణ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార పార్టీ వై ఎస్ ఆర్ సి పి నాయకులు పదవులు అనుభవిస్తూ ఈ నియోజకవర్గంలో పేదల భూములు కారుచౌకగా లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎన్నికలలో తమ అధికారాన్ని ఉపయోగించి పెత్తనం చేసి లక్ష ఓట్ల మెజారిటీ తెస్తామని కోరడం సిగ్గుచేటని ఓటర్లకు డబ్బులు పంచి ఓటరు కొందామని ఓవైపు మరోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలోదొంగ ఓట్లను రెడీ చేసుకుని సిద్ధమయ్యారని, దౌర్జన్యానికి కూడా పాల్పడడానికి సిద్ధంగా ఉన్నారని అధికార దుర్వినియోగం చేయడానికి కూడా వెనకాడరని నియోజకవర్గంలో జరిగే సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని సి.బి.ఐ తోను విచారణ జరిపించాలని కోరతామని వారి ఆగడాలపై కరపత్రం వేస్తాం కర్ర పెత్తనానికి కట్టడి చేస్తామని, దొంగ స్కీం లతో కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా పేర్లు మార్చి తమ ఖాతాలో వేసుకుంటున్న అని దుయ్యబట్టారు.
ఈ ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ ఓటర్లను తమ పార్టీకి ఓటు వేసే విధంగా మలుచు కుంటామని, జనసేన ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించిందని ఈ ఎన్నికలలో గెలిచి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎన్నికల అనంతరం కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలపై తమ పార్టీ పోరాడుతుందని వైయస్సార్ సిపి నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని వారన్నారు
Home ఆంధ్రప్రదేశ్ బద్వేల్ ఉప ఎన్నికల్లో వైకాపా ఆగడాలు అడ్డుకుంటాం బిజెపి ఎంపీ సురేష్, మాజీ మంత్రి ఆదినారాయణ...