రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ బాష
రూ. 78 లక్షలతో 14వ ఆర్థిక సంఘం నిధులతో 25, 29వ డివిజన్లలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు శంఖుస్థాపన
కడప, సెప్టెంబర్ 22
అన్ని రంగాల్లో.. వైఎస్ఆర్ జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజద్ బాష పేర్కొన్నారు.
బుధవారం స్థానిక 25, 29వ డివిజన్లలో రూ.78 లక్షల 14వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మిస్తున్న నూతన సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి.అంజాద్ బాషా శంఖుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజద్ బాష మాట్లాడుతూ.. వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని కుల, మత, వర్గాలు ,పార్టీలకు అతీతంగా ఆయన అమలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను, వివిధ రకాల అభివృద్ధి సంక్షేమ ఫలాలను.. అర్హులైనవారి ఇంటి ముంగిళ్ళకే చేరుస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కడప జిల్లావాసి కావడం.. జిల్లా ప్రజల అదృష్టమన్నారు. కడప నగర అభివృద్ధిలో భాగంగా.. రూ.54 కోట్లతో కడప నగరంలోని అన్ని డివిజన్లను సమానంగా అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే.. ప్రస్తుతం 25, 29వ డివిజన్లలో సిసిరోడ్లు, సీసీ డ్రైన్ కాలువలను నియమించేందుకు శంఖుస్థాపన చేయడం జరిగిందన్నారు.
రాబోవు ఏడాది లోపు పాత కడప చెరువును హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ తరహాలో పిక్నిక్ స్పాట్ గా అభివృద్ధి చేస్తామన్నారు. పాత కడప చెరువు చుట్టూ పాదచారులు కోసం రాజీవ్ మార్గ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కడప నగరంలోని ట్రాఫిక్ నియంత్రించడానికి 16 రోడ్లను విస్తరిస్తున్నామని తెలిపారు. కడపలో ఇప్పటికే 5 ప్రధాన రోడ్ల విస్తరణ పనుల్లో కొన్ని పూర్తికాగా.. కొన్ని కార్యాచరణలో ఉన్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కార్పొరేటర్ సూరి, 29వ డివిజన్ కార్పొరేటర్ రిజ్వాన్ బాషా, ఇంచార్జి జిలానీ బాషా, కార్పొరేటర్ షఫీ, ఎన్.ఆర్.ఐ. ఇలియాస్, అజ్మతుల్లా, కమాల్ బాషా, జఫరుల్లా, మున్నా, మునీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు