Home తెలంగాణ అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందెల కృషి చేస్తాం – జిల్లా కలెక్టర్ డాక్టర్...

అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందెల కృషి చేస్తాం – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

227
0

పెద్దపల్లి   అక్టోబర్ 8

సింగరేణి సంస్థ కింద జరిగిన భూ సేకరణ ప్రక్రియ లో  అర్హులైన భూ నిర్వాసితులకు  చట్టప్రకారం పరిహారం అందెల కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.   ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ నిర్వాసితుల సమస్యల పై శుక్రవారం కలెక్టర్ చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.  అంతర్గాం మండలంలోని    లింగాపూర్ గ్రామం, రామగుండం మండలంలోని మేడిపల్లి గ్రామంలో  సింగరేణి సేకరించిన భూమి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందించాలని గ్రామస్తులు కోరుతున్నారని తెలిపారు.  మేడిపల్లి మరియు లింగాపూర్ గ్రామస్తులు తమకు భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందజేయాలని కోరారు.  రాష్ట్రమంతా భూసేకరణ ప్రక్రియ కు ఒకే విధానం అమలు చేస్తున్నామని, సింగరేణి సంస్థ కింద సేకరించిన భూమికి కటాఫ్ డేట్ నిర్ణయించి అర్హులైన వారందరికీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పరిశీలించి పరిహరం సంబంధిత అంశాల పై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.నరసింహమూర్తి, సింగరేణి అధికారులు సంబంధిత అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Previous articleరబీ 2021 పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమం
Next articleఆనంద్ దేవ‌ర‌కొండ – కేవీ గుహ‌న్ – వెంక‌ట్ త‌లారి `హైవే` షూటింగ్ పూర్తి.. తెలంగాణ‌, ఆంధ్ర ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల్లో షూటింగ్ జ‌రుపుకున్న హైవే టీమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here