ఖమ్మం
బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడానికి ఆ కుటుంబ సభ్యులు వెళ్ళడంతో దొంగలు తమ పని కానిచ్చారు. కుటుంబం తిరిగి వచ్చేసరికల్లా 40 లక్షల రూపాయలు విలువచేసే సొత్తు ను అపహరించారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలో
కట్టా దుర్గారావు అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. దుర్గారావు కుటుంబీకులు బతుకమ్మ వేడుకలను చూసేందుకు వెళ్లగా ఈ చోరీ జరిగింది. పది లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి చోరీ చేసారు. పోలీసులు క్లూస్ టీం తో వేలిముద్రలు
సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.