Home తెలంగాణ మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ను మార్చాలి కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ...

మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు కేసీఆర్ ను మార్చాలి కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు

79
0

కామారెడ్డి ఫిబ్రవరి 07

భారత రాజ్యాంగం పట్ల కెసిఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందుగల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ మార్చాల్సింది భారత రాజ్యాంగాన్ని కాదని  కేసీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి స్థానం నుండి మార్చాలి అని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని విద్యార్థులు, నిరుద్యోగులు,ప్రజలు కెసిఆర్ కు బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు 250 మంది నిరుద్యోగులు నోటిఫికేషన్లు విడుదల కావడం లేదన్న బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని,తమ ఆత్మహత్యలకు కారణం కెసిఆర్ పాలనే అని రాయడం జరిగింది అని,బంగారు తెలంగాణ పేరుతో నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్నారని ఇలాంటి ముఖ్యమంత్రిని మారిస్తేనే తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ నాయకులు రాజు,సతీష్,సందీప్ ఆంజనేయులు,నర్సింలు ప్రవీణ్,నవీన్,ప్రదీప్,రవి లక్ష్మణ్,శ్రీనివాస్ మొదలగువారు పాల్గొనడం జరిగింది.

Previous articleఫిబ్రవరి 14న విడుదల కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ సింగిల్ ‘కళావతి’
Next articleసంపూర్ణ ఆరోగ్యానికి యోగ దోహదపడుతుంది జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here