మద్దికేర
మద్దికేర మండల పరిధిలోని బురుజుల గ్రామంలో గత వారం కురిసిన వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను మద్దికెర మండల వ్యవసాయ అధికారి హేమలత గ్రామంలో పర్యటించి ప్రస్తుతం కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.దెబ్బతిన్న పంటల వాటి వివరాలను రైతు భరోసా కేంద్ర సిబ్బంది ద్వారా తీసుకొని పూర్తి నివేదికను పై అధికారులకు పంపించడం జరిగిందని తెలియజేశారు. వాతావరణ శాఖ ఆదేశాల మేరకు మరో రెండు మూడు రోజుల వరకు వర్ష సూచన ఉన్నందున రైతులు పురుగు మందులు పిచికారీ చేయవద్దని సూచించారు.అదేవిధంగా రేపటి నుండి రైతు భరోసా కేంద్రాల నందు 80% సబ్సిడీపై పప్పు శనగ విత్తనాలు కొరకు రైతులు రిజిస్ట్రేషన్ చేపించుకోవలసినదిగా తెలియచేసారు.క్విటం పూర్తి ధర రూ. 6900,కాగా 80% సబ్సిడీ పోవు రైతు కట్టవలసినది రూ.1380.ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు మౌనిక, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.