Home వార్తలు ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ దీపావ‌ళి స్పెష‌ల్ షో..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్...

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ దీపావ‌ళి స్పెష‌ల్ షో..యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్ సెన్సేష‌న్‌ త‌మ‌న్ స‌ర‌దా స‌ర‌దా సాగిన ఎపిసోడ్‌

76
0

ప్ర‌ముఖ తెలుగు ఛానెల్ జెమినీటీవీలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా ప్రారంభ‌మైన షో ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’ ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌లో దీపావ‌ళి కానుక‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌బోతున్నారు. అది కూడా ఏకంగా ఇద్ద‌రు స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌తో వారే రాక్‌స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్‌, మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌. తార‌క్‌తో వీరిద్ద‌రూ చేసిన స‌ర‌దాను దీపావ‌ళికి ఎంజాయ్ చేసేయాల్సిందే. దీనికి సంబంధించిన ప్రోమోను రీసెంట్‌గా విడుద‌ల చేశారు. ప్రోమో చూస్తుంటేనే ఎంతో స‌ర‌దా స‌ర‌దాగా అనిపించింది. పూర్తి ఎపిసోడ్ మాత్రం న‌వంబ‌ర్ 4 రాత్రి 8గంట‌ల 30నిమిషాల‌కు ప్రసారం అవుతుంది.

Previous articleకొత్త బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
Next articleహాట్ హాట్ గా టీపీసీసీ భేటీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here