Home తెలంగాణ తాను టీఆర్ఎస్‌లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరు! సంగారెడ్డి ఎమ్మెల్యే...

తాను టీఆర్ఎస్‌లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరు! సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

143
0

హైదరాబాద్‌ సెప్టెంబర్ 24
కాంగ్రెస్‌ పార్టీలో వర్గ విభేదాలు మరో మారు భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరు అన్న చందంగా ఆ పార్టీ పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతున్నది. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆ పార్టీ విధానాలపై ఫైర్‌ అయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏకైక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న నాకు మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇంత లాయల్‌గా ఉంటే అవమానాలు చేస్తున్నారని, తాను టీఆర్ఎస్‌లోకి పోవాలని అనుకుంటే అడ్డుకునేదెవరని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. గజ్వేల్ సభలో గీతా రెడ్డీ తనకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు. గీతా రెడ్డి అంటే గౌరవమే..కానీ గజ్వేల్ సభలో తనకు అవమానం జరిగిందన్నారు.ఎవరి ఒత్తిడి మేరకు గీతారెడ్డి మాట్లాడనికి నాకు అవకాశం ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని నిర్వేదం వ్యక్తం చేశారు. ఒకరి నెత్తిన ఒకరు చెయ్యి పెట్టుకుంటే కాంగ్రెస్ అధికారంలో కి వస్తుందా అని ప్రశ్నించారు. పార్టీలో జరిగే అన్యాయాలను ప్రశ్నిస్తే సోషల్ మీడియా ద్వారా మా మీద విష ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నేను టీఆర్ఎస్ లోకి పోవాలని అనుకుంటే అడ్డు ఎవరు. పార్టీలో నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే లకు కూడా గౌరవించడo లేదన్నారు. పార్టీ కోసం పని చేసే నాకే అవమానాలు ఎదురవుతున్నాయని వాపోయారు.రాష్ట్రంలో నాకు కూడా అభిమానులు ఉన్నారు. కావాలంటే పార్టీ సపోర్ట్ లేకుండా 2లక్షల మందితో సభ పెట్టి చూపిస్తానన్నారు. పార్టీ లో మాట్లాడే అవకాశం దొరకడం లేదు కాబట్టి మీడియాతో తప్పనిసరి పరిస్థితిలోనే మీడియా ముందు నా ఆవేదన వ్యక్తం చేస్తున్ననన్నారు.

Previous articleఫార్మాసిస్టు ఆత్మహత్యపై విచారణ
Next articleతెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం మొత్తం 9 మంది మాజీ సభ్యులకు సభ సంతాపం అక్టోబర్‌ 5 వరకు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here