వాషింగ్టన్ అక్టోబర్ 5
సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు ఆగిపోవాదం తో గతంలో ఎన్నడూ లేని రీతిలో సుమారు 7 గంటల పాటు వీటి సేవలు నిలిచిపోయి. అసలు పేస్ బుక్ సేవలు ఎందుకు నిలిచి పోయాయి, ప్రపంచం దాదాపు స్తంభించినంత పనైంది. అందుకు గల కారణాలు ఏమిటని లోతుకు వెలితే అందుకు ఓ మహిళా కారణమని స్పష్టమవుతుంది. దీనిపై ఫేస్‌బుక్ సీఈవో జుకెర్‌బర్గ్ సారీ చెప్పారు. ఇది ఆయనకు భారీగా నష్టాన్ని కూడా మిగిల్చింది. అయితే తాజాగా మరో సంచలనం కలిగించే వార్త ఏంటంటే.. గతంలో ఈ ఫేస్‌బుక్ సంస్థలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టిన ఆ సంస్థ మాజీ ఉద్యోగి తానెవరో లైవ్‌లోకి వచ్చి చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే వీటి సేవలు నిలిచిపోవడం గమనార్హం.
ఇంతకీ ఎవరా మాజీ ఉద్యోగి?
సోషల్ మీడియా దిగ్గజ సంస్థ అయిన ఫేస్‌బుక్‌లో జరుగుతున్న అక్రమాల గురించి సదరు మహిళ గతంలోనే బయటపెట్టింది. అయితే ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న ఆమె.. తాజాగా తన వివరాలను పబ్లిగ్గా వెల్లడించింది. ఆమె పేరు ఫ్రాన్సెస్ హాగెన్. ఇప్పుడామె ఫెడరల్ విజిల్‌బ్లోయర్ రక్షణ కోసం కూడా దరఖాస్తు చేసుకుంది. ఫేస్‌బుక్ సంస్థకు సంబంధించిన అంతర్గత డాక్యుమెంట్లను కూడా ఆమె కాంగ్రెస్‌తోపాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ కమిషన్, ద వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు అందజేసింది. ఫేస్‌బుక్‌కు కేవలం లాభాల పట్ల మోజు తప్ప యూజర్ల భద్రత పట్ల పట్టింపు లేదని ఆమె ఆరోపించింది.తాను ఎన్నో సోషల్ మీడియా సైట్లను చూశానని, కానీ ఫేస్‌బుక్‌లో జరిగినట్లు మరెక్కడా జరగదని చెప్పింది. తన అల్గారిథాన్ని సురక్షితంగా మారిస్తే.. యూజర్లు తక్కువ సమయం సైట్‌పై ఉంటారని, దీంతో యాడ్ క్లిక్స్ తగ్గడం, తద్వారా ఆదాయం తగ్గడం జరుగుతుందని ఫేస్‌బుక్ గుర్తించినట్లు హాగెన్ వెల్లడించింది. ఇన్‌స్టాగ్రామ్ అనేది టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని ఈమె సంబంధిత డాక్యుమెంట్లు, సమాచారాన్ని అందించిన తర్వాతే ఆ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ కిడ్స్ లాంచింగ్‌ను ఆపేసింది.
ఫేస్‌బుక్ అల్గారిథమ్ అంటే ఏమిటి ?
మీరు చూసే ఉంటారు ఫేస్‌బుక్‌లో ఎక్కువగా విద్వేషపూరిత, జనాలను రెచ్చగొట్టే కంటెంటే కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఫేస్‌బుక్ అల్గారిథమే కారణమని హాగెన్ చెబుతోంది. సాధారణంగా మనుషుల మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు ఒక టాపిక్ నుంచి మరొక టాపిక్‌కు మారుతుంటారు. కానీ ఈ అల్గారిథమ్‌లు అలా కాదు. అందుకే ఇవి టీనేజర్లకు హానికారకం. ఎవరైనా టీనేజర్లు బరువు తగ్గడానికి ఏదైనా వెతికితే చాలు.. ఈ అల్గారిథాలు అవే చూపిస్తుంటాయి. దీంతో వాళ్లలో ఆహార అలవాట్లు మారుతున్నాయి. అందుకే ఫేస్‌బుక్ అందరికీ తెలిసిన దాని కంటే చాలా ఎక్కువ ప్రమాదమని నేను చెబుతున్నాను. అది రాను రాను దారుణంగా మారుతోంది అని హాగెన్ చెప్పింది.
ఫేస్‌బుక్ పబ్లిగ్గా చెబుతున్నది ఒకటి.. అంతర్గతంగా చేస్తున్నది మరొకటి
ఫేస్‌బుక్ పబ్లిగ్గా చెబుతున్నది ఒకటి.. అంతర్గతంగా చేస్తున్నది మరొకటని ఆమె స్పష్టం చేసింది. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తమ అల్గారిథమ్స్ విద్వేష, హింసాత్మక సమాచారాన్ని ప్రోత్సహించిందని ఫేస్‌బుక్‌కు తెలుసు. అయినా వాటిని కట్టడి చేయలేదు. ఇలాంటి విద్వేష కంటెంట్‌ను ప్రమోట్ చేస్తే.. తమ ట్రాఫిక్ పెరుగుతుందని ఫేస్‌బుక్‌కు తెలుసు. విద్వేష, విభజనవాదానికి సంబంధించిన కంటెంటే ప్రజలను ఆకర్షిస్తోందని గుర్తించి వాటినే ఫేస్‌బుక్ అల్గారిథమ్స్ ప్రోత్సహిస్తున్నాయి అని హాగెన్ వెల్లడించింది.జుకెర్‌బర్గ్ ఇలాంటి విద్వేషపూరిత సోషల్ మీడియాను నెలకొల్పాలని అనుకోలేదని, అయితే ఇలాంటి విద్వేష కంటెంట్‌ను ప్రోత్సహించే అవకాశాన్ని మాత్రం కల్పించారని హాగెన్ చెప్పింది. ఆమె లైవ్‌లోకి వచ్చి తానెవరో చెప్పిన కొన్ని గంటల తర్వాత ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి.