విజయవాడ
దేవాదాయ భూములను దేవాదాయ శాఖ మంత్రే దోచుకుంటున్నారు. తన అనుచరులతో ఒక టీం ను ఏర్పాటు చేసి దేవుడి భూములు కాజేస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. తాడేపల్లి ప్యాలెస్ కి, సజ్జలకి వాటా కూడా ఉందా అని ప్రశ్నిస్తున్నాం. వెయ్యి కోట్లు దోచుకున్న మంత్రి వెల్లంపల్లి పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. వాటాలు పుచ్చుని అతన్ని కాపాడుతున్నారనే అనుమానాలు ఉన్నాయి. డిజటలైజేషన్ ప్రకియ కాదు… దోచుకునే ప్రక్రియ కి శ్రీకారం చుట్టారు. 5.50ఎకరాల దేవాదాయ భూమి జక్కంపూడి లో పది కోట్లు ఉంది. కోటి రూపాలకే ఈ స్థలం కొట్టేయాలని మంత్రి ఒ.యస్.డి అశోక్ మంత్రాంగం నడిపాడు. ఎనిమిది కోడ్లు ఉన్న మరో బిల్డింగ్ ను కోటిన్నరకు కొట్టేయాలని ప్లాన్ వేశారు. 18కోట్ల రూపాయలు ఆస్తులను మంత్రి కి తెలియకుండా కొట్టేయగలరా. దేవాదాయ శాఖ భూమికి యన్.ఒ.సి ఎలా ఇస్తారు. ఆ శాఖ మంత్రిగా దేవుడి భూములు, ఆస్తులు కాపాడటం మీ బాధ్యత కాదా అని అడిగారు.
మీ కోటరీ లో ఉన్న బుజ్జి, కొనకళ్ల తో పాటు ఒ.యస్.డి అశోక్ కి వాటా ఇచ్చారా. మీ ప్రమేయం లేకపోతే ఒ.యస్.డి పై కేసు ఎందుకు పెట్టలేదు. మంత్రి దగ్గర ఉన్నవారు వేలల్లో దోచుకుంటే బయటకి పంపుతారు. లక్షల్లో, కోట్లలో దోచుకుంటే ప్రమోషన్లు ఇస్తారని అయన విమర్శించారు.