కడప
కడప జిల్లా అంతటా వైకాపా గాలులు వీచి మిర్చి స్థానిక ఎన్నికలలో మండలాలు జడ్పిటిసి స్థానాలు గెలవడం జరిగింది ఒక్క బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలంలోమాత్రం ఎంపీపీ జడ్పిటిసి స్థానాలు రెండు కూడా కోల్పోవాల్సి వచ్చింది లోపం ఎక్కడ జరిగిందని కడప పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి సూటిగా వైకాపా నాయకులు కార్యకర్తలను ప్రశ్నించారు బుధవారం బద్వేల్ లోని ఒక ప్రైవేటు కళ్యాణ మండపంలో గోపవరం మండలం వైకాపా నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశానికి బద్వేల్ వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కడప నగర మేయర్ సురేష్ బాబు వైకాపా మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బద్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ గోపవరం మండలాన్ని వైకాపా కోల్పోవడం దురదృష్టకరమన్నారు లోపం ఎక్కడ జరిగిందో గానీ బద్వేల్ ఉప ఎన్నికల్లో ఇలాంటి లోపం జరగకుండా నాయకులు కార్యకర్తలు ఎప్పటినుంచే కలిసికట్టుగా కృషిచేసి భారీ మెజార్టీ తీసుకురావాలని ఆయన కోరారు గోపవరం మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు మండలంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చుతో పరిశ్రమ త్వరలో స్థాపిస్తునట్లు తెలిపారు ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా కొన్ని వందల మందికి పరోక్షంగా మరి కొన్ని వందల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు సోమశిల జలాశయం బ్యాక్ వాటర్ ద్వారా బద్వేలు గోపవరం ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు వైకాపా అభ్యర్థి డాక్టర్ సుధ కు భారీ మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత నాయకులకు కార్యకర్తలపై ఉందన్నారు గతంలో జరిగిన పొరపాటు ఉప ఎన్నికల్లో జరగకుండా ఎప్పటినుంచి సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు ప్రతి ఓటర్ ను నాలుగైదు సార్లు కలిసి ఫ్యాన్ గుర్తు ఓట్లు వేయాలని కోరాలని ఆయన తెలిపారు సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడంతో పాటు ఎందుకు సంబంధించిన కరపత్రా లు ప్రజలకు అందించాలని ఆయన కోరారు అందరూ కలిసికట్టుగా కృషి చేస్తే అనుకున్న మెజారిటీని తీసుకురావడం పెద్ద కష్టం కాదని అన్నారు ఇంకా పలు విషయాల గురించి ఆయన మాట్లాడారు