అమరావతి సెప్టెంబర్ 29
జనసేన పార్టీ విస్తృత సమావేశంలో పవన్ కల్యాణ్ మరోసారి వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. వైసీపీ నేతలకు డబ్బు, అధికారం, మదం, మాత్సర్యం పుష్కలంగా ఉన్నాయని, భయం ఒక్కటే లేదని చెప్పిన ఆయన.. వారికి తాను కచ్చితంగా భయం నేర్పిస్తానని స్పష్టం చేశారు.వైసీపీ నేతలకు సంస్కారం లేదని జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారాన్ని నూనూగు మీసాలు కూడా రాని పదహారేళ్ల కుర్రాళ్లు నేర్పిస్తారని అన్నారుకొన్నిరోజుల క్రితం ట్విట్టర్లో ‘.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు’ అంటూ ఒక కవిత షేర్ చేసిన పవన్ కల్యాణ్.. అదే కవితతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు నూనూగు మీసాలు కూడా రాని పదహారేళ్ల కుర్రాళ్లు నేర్పిస్తారని ఎద్దేవా చేశారు. అలాగే నోటికొచ్చినట్లు అనాల్సినవన్నీ అనేసి, కులాల వెనుక దాక్కుంటే బయటకు లాక్కొచి కొడతానని హెచ్చరించారు. లేదంటే భారతీయ శిక్షా స్మృతి ప్రకారం శిక్షలు పడేలా చేస్తానని చెప్పారు. పార్టీ పెట్టినప్పటి నుంచి తాను చాలా బాధ్యతగా ఉన్నానని, ఒక మాట కూడా తూలడం జరగలేదని అన్నారు. తాను బాపట్లలో పుట్టానని, తనకు బూతులు రాకపోవడం జరగదని చెప్పారు. తనకు నాలుగు భాషలు వచ్చని, ఏ భాషలోనైనా తిడతానని తెలిపారు. ఇంకా ఏదైనా భాషలో కావాలంటే నేర్చుకొని మరీ తిడతానని పేర్కొన్నారు.