విజయవాడ
కృష్ణాజిల్లా కోడూరు కోడూరు గ్రామంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు..పొలంలో అక్రమంగా మట్టి తరలించిన వివాదంలో బావా బావమరుదులు ఘర్షణ పడ్డారు. ఘర్షణ ముదిరింది. శ్రావణం హరికృష్ణను చందన వెంకటేశ్వరరావు కత్తితో నరికాడు. హరికృష్ణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. అవనిగడ్డ సీఐ భీమేశ్వర రవి కుమార్, కోడూరు ఎస్సై నాగరాజులు విచారణ ప్రారంభించారు.