వనపర్తి సెప్టెంబర్ 22 (
తెలంగాణ ఏర్పాటుతోనే విద్యుత్ సమస్యలు తీరాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామంలో బుధవారం 33/11 సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే విద్యుత్ సమస్యలు తీరాయని మంత్రి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్ల మంత్రి వెల్లడించారు. అందులో భాగంగా అవసరమైన మేరకు కొత్త సబ్ స్టేషన్లు, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త లైన్లు వేస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.