ఏలూరు
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పవర్ పేట రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకిందపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. ఉషా పిక్చర్ సమీపంలో చిట్టివలస పాకలు ప్రాతంలోని రైల్వే ట్రాక్ పై సింహాద్రి ఎక్స్ ప్రెస్ క్రింద పడి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతురాలు ఆకుపచ్చ డిజైన్తో ఉన్న లేత ఆకుపచ్చ చీర, ఎరుపు లంగా, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ డిజైన్తో ఉన్న జాకెట్ ధరించింది. ఏలూరు రైల్వే పోలీసులు కేసునమోదు చేసారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు..