విజయవాడ
కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం అమ్మిరెడ్డిగూడెంలో విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. రావూరి లక్ష్మీ అనే మహిళా అగ్నిప్రమాదంలో ఇంట్లోనే సజీవ దహనం అయింది. ఫైరింజన్ సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పింది. తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం. శేఖర్ బాబు, ఎస్సై వి.సతీష్ దర్యాప్తు చేపట్టారు.