జీడిమెట్ల
ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళను మృత్యువు రూపంలో లారీ ఢీకొంది..దాంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ విమానపురి కాలనీ కి చెందిన వినిత రెడ్డి (30) ఉదయం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా అదే కాలనీలో ఓ లారీ ఆమెను ఢీకొనడంతో మహిళ కింద పడింది..అనంతరం ఆమెపై నుండి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.