మందమర్రి.నవంబర్ 08
ప్రమాద రహిత సమాజ స్థాపనలో మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తు వారి కుటుంబ సభ్యులకు రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి జరిగే నష్టాన్ని వివరిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ ను వాడేవిధంగా ముఖ్య పాత్ర పోషించాలని మందమర్రి ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ పేర్కొన్నారు.ఏరియా జిఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రహదారి భద్రత సందర్భంగా ఏరియా సెక్యూరిటీ సిబ్బంది తో సోమవారం హెల్మెట్ ర్యాలీ నిర్వహించారు.స్థానిక సింగరేణి పాఠశాల మైదానంనుండి ప్రారంభమైన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనము ఉన్న సింగరేణి ఉద్యోగులు, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు. ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించేటపుడు హెల్మట్ ప్రాధాన్యం తెలిపేందుకే ఈ ర్యాలీని ఏర్పాటు చేసామని బైక్ వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని ఆయన అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారిలో హెల్మెట్ ధరించని కారణంగా చనిపోతున్నవారే ఎక్కువని మనము సురక్షితంగా ఉంటే కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారని తెలిపారు.వాహనాలు నడుపుతున్న సమయంలో హెల్మెట్ ధరించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు కూడా హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత వివరించి బైక్ పై ప్రయాణించే సమయంలో భర్తకు, కుమారులకు, సోదరులకు కచ్చితంగా హెల్మెట్ ధరించేలా మహిళలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం గోపాల్ సింగ్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ ఓదెలు, సీనియర్ సెక్యూరిటి ఆఫీసర్ నగునూరి రవి, సీనియర్ ఇన్స్పెక్టర్ సుంకరి రమేశ్, జమేదార్లు, సెక్యూరిటీ సిబ్బంది,టిబిజికెఎస్ పిట్ సెక్రెటరీ అనుగుల రాజయ్య, ఏఐటీయూసీ పిట్ సెక్రెటరీ పారిపెల్లి సంజీవ్ కుమార్, ప్రైవేట్ సెక్యూరిటి సిబ్బంది పాల్గొన్నారు.