వనపర్తి సెప్టెంబర్ 29
పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి కలెక్టరేట్‌లో సాగునీటిపారుదల మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఏడాదిలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్లకు నీళ్లు ఇచ్చే విధంగా పనుల్లో వేగంపెంచాలని అధికారులను ఆదేశించారు.సాగునీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కాలువల కోసం ప్రభుత్వం సేకరించిన భూమి పరిధిని గుర్తించి రాళ్లను నాటా. ఈ పనుల కోసం ఉపాధిహామీ కూలీలతో పాటు, వీఆర్ఓ, వీఆర్ఏలను సాగునీటి శాఖ ఏఈలకు అటాచ్ చేయాలని పేర్కొన్నారు. సాగునీటి కాలువలపై ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణ పెరగాలి.క్షేత్రస్థాయి సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం కావాలనే సాగునీటి శాఖను పునర్ వ్యవస్థీకరించి విస్తరించారు. సీఈ కార్యాలయం కార్యకలాపాలు వెంటనే వనపర్తి నుంచి ప్రారంభించాలని ఆదేశించారు.ఉపాధిహామీలో కాల్వల పూడికతీత చేపట్టాలని గతంలో చెప్పడం జరిగింది. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోపం మూలంగా అనుకున్నంతగా పనులు సరిగ్గా జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తూములు, కాల్వలను సరిచేయడంపై అధికారులు శ్రద్ధ చూపాలి. కాల్వల పూడికతీత సమయంలో ఏఈలు, డీఈలు కచ్చితంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.పనివిధానంలో అధికారులు పాత పద్దతులు మాని వేగంగా పనిచేయాలి. జిల్లాలో ప్రతిపాదించిన 11 చెక్ డ్యాంల నిర్మాణం త్వరగా పూర్తికావాన్నారు.రంగ సముద్రం రిజర్వాయర్ ఎప్పుడూ నిండుగా ఉంచాలి . కృష్ణా నది నుంచి సముద్రానికి నీరు వృథాగా పోతున్నా .. కాల్వలకు నీళ్లు విడుదల చేయడానికి అధికారులు సంకోచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుని నీళ్లు విడుదల చేయాలని సూచించారు.చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మినీ ఎత్తిపోతల పథకాల వాస్తవ పరిస్థితిని వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నాలుగు రోజులలో నివేదిక అందజేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.ఘణపురం బ్రాంచ్ కెనాల్ మీద వయొడెక్ట్ , స్ట్రక్చర్లు వెంటనే పూర్తి కావాలి. కమాలుద్దీన్ పూర్ డిస్ట్రిబ్యూటరీపై ఓటీ వెంటనే నిర్మించాలి.మామిడిమాడ రిజర్వాయర్ పనుల విషయంలో ఏజెన్సీతో చర్చించాలని మంత్రి తెలిపారు. కర్నెతండా లిఫ్ట్ టెండర్లు వెంటనే పిలవాలి. కేఎల్ఐ కింద కొత్త ఆన్ లైన్ రిజర్వాయర్ల నిర్మాణానికి వెంటనే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాల్వలన్నీ ఆన్ లైన్ రిజర్వాయర్లకు అనుసంధానం అయ్యేలా చూడాలన్నారు.బుద్దారం కుడి కాలువ డిస్ట్రిబ్యూటరీకి టెండర్లు పిలిచి, స్ట్రక్చర్లు పూర్తిచేయాలి. కేఎల్ఐ ప్రధాన కాలువ కింద అధిక ఆయకట్టు ఉన్న డి8 మీద ఎంజె 1,2,3,4,5,8 లలో మట్టి తీసే పనులు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. రాంరెడ్డిపల్లి తండా వద్ద వెంటనే పైపులు వేయించాలి. పాన్ గల్ బ్రాంచ్ కెనాల్ లైనింగ్ చేపట్టి పూర్తి చేయాలని నిరంజన్‌రెడ్డి ఆదేశించారు.ఈకార్యక్రమంలో..ఎంపీ రాములు, కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, బీరం హర్షవర్దన్ రెడ్డి, జేసీ వేణుగోపాల్, జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, సీఈలు హమీద్ ఖాన్, రఘునాధరావు, జిల్లా వైద్యాధికారి చందూ నాయక్, ఎస్ఈలు విజయభాస్కర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సత్యశీలారెడ్డి, ఈఈలు, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు