తిరుపతి, మా ప్రతినిధి,నవంబర్ 02
ఈ నెల 14 న తిరుపతి వేదికగా జరగనున్న 29 వ సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేసేందుకు అధికారులందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఈ నెల 14 న తిరుపతి తాజ్ హోటల్ లో నిర్వహించనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ కార్యక్రమ నిర్వహణపై వివిద శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్ గిరీషా పి.ఎస్. , తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పల నాయుడు , జిల్లా జాయింట్ కలెక్టర్ లు (రెవెన్యూ, అభివృద్ధి, హౌసింగ్, సంక్షేమం) రాజాబాబు, శ్రీధర్, వేంకటేశ్వర, రాజశేఖర్, లతో కలసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి వేదికగా తాజ్ హోటల్ నందు ఈ నెల 14 న జరగనున్న 29 వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం గౌ. కేంద్ర హోం శాఖా మంత్రి అద్యక్షతన జరగనుండగా ఈ జోనల్ కౌన్సిల్ లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ , తెలంగాణ , పాండిచ్చేరి రాష్ట్రాల గౌ. ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ లు గౌ. లెఫ్ట్నెంట్ గవర్నర్ లు పాల్గొననున్నారని తెలిపారు. సదరన్ జోనల్ కౌన్సిల్ నిర్వహణకు సంబందించి అవసరమైన ఏర్పాట్ల నిమిత్తం శాఖల వారీగా కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. తాజ్ లో నిర్వహించే సమావేశమునకు సంబందించి ఏర్పాట్లు మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వీవీఐపీ/వీఐపీ లకు వసతి, సెక్యూరిటి, ఫుడ్ ఇతర సౌకర్యాల నిమిత్తం కేటాయించిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. వీవీఐపీ/వీఐపీ లకు ఎయిర్పోర్టు, వసతి సముదాయాల వద్ద హెల్ప్ డెస్క్, రిసెప్షన్ ను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని మరియు వసతి సముదాయాలలో డాక్టర్ లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
సమావేశం జరుగు తాజ్ హోటల్ లో సమావేశం నిర్వహణ , బందోబస్తు, వాహనాల పార్కింగ్ తదితర అంశాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ , అర్బన్ ఎస్పీ, తిరుపతి నగరపాలక సంస్థ కమీషనర్, జిల్లా జాయింట్ కలెక్టర్ లు (రెవెన్యూ, అభివృద్ధి, హౌసింగ్, సంక్షేమం) లతో కలసి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డా.వెంగమ్మ, తిరుపతి అడిషినల్ ఎస్పీ సుప్రజ , తిరుపతి , చిత్తూరు ఆర్డీఓ లు కనకనరసారెడ్డి, రేణుక , డ్వామా, డీఆర్ డీఏ పీ.డీ. లు చంద్రశేఖర్, తులసి, రుయా సూపరింటెండెంట్ డా.భారతి, డీటీసి బసి రెడ్డి, పీ ఆర్ , ఆర్ అండ్ బీ ఎస్.ఈ.లు అమరనాథ్ రెడ్డి, దేవానందం, తుడా సెక్రెటరీ లక్ష్మి, స్మార్ట్ సిటీ జీ.ఎం. చంద్రమౌళి , మెప్మా పి.డి. రాధమ్మ, డీ ఎం అండ్ హెచ్ ఓ, డీ సీ హెచ్ ఎస్ లు డా. శ్రీహరి, డా. సరలమ్మ, ఇతర సంబందిత అధికారులు పాల్గొన్నారు.