Home తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం

122
0

హైదరాబాద్
టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాల పై హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 25న జరిగే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ మరియు నవంబర్ 15న జరగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపైన దిశానిర్దేశం చేశారు. ఖమ్మం, పాలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలు ఈ సమావేశానికి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులను ఉద్దేశించి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులంతా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్లీనరీ మరియు బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ, మండల స్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలన్న కేటీఆర్.ఈ నెల 27న జరిగే నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశాలు లోపు ఈ సమావేశాలను పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభ కి ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యచరణ ఉండాలని కేటీఆర్ సూచించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతుందని, త్వరలో మరింత పెద్ద ఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ ఉంటుందన్నారు. అంతేకాకుండా పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ త్వరలో చేస్తారని, నవంబర్ 15 బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులకు ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు.  పార్టీ ఇచ్చే ప్రతి పిలుపుని విజయవంతం చేసేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన ప్రజా నాయకుడు కేసీఆర్ గారన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిననాటి నుంచి అద్భుతమైన పరిపాలనతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేస్తూ వస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన పరిపాలన తో ప్రజల గుండెల్లో బలమైన స్థానం దక్కించుకున్నారన్నారు. ప్రతిసారి ప్రజలు పార్టీ పట్ల తమ ప్రేమను వ్యక్త పరుస్తూ వస్తూనే ఉండటం దీనికి నిదర్శనమన్నారు. ఎక్కడా లేనన్ని అపూర్వమైన కార్యక్రమాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మనదని, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తించి ప్రతి ఎన్నికల్లోనూ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకుపోయేందుకు సమాయత్తమవ్వాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.

Previous articleమిలిట‌రీ బ‌స్సుపై బాంబు దాడి ..13 మంది మృతి
Next articleఇండో-పాక్‌ సరిహద్దులో అక్రమంగా తరలిస్తున్న ఆయుధాలను స్వాధీనం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here