Home జాతీయ వార్తలు తప్పు తప్పే ..శిక్ష శిక్షనే కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

తప్పు తప్పే ..శిక్ష శిక్షనే కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

116
0

బెంగళూర్ నవంబర్ 18
ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడి, తరువాత పెళ్లి చేసుకున్నా శిక్ష నుంచి తప్పించుకోలేరని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. లైంగికదాడి కేసులో బాధితురాలిని నిందితుడు ఆ తరువాత పెళ్లాడాడు, వారికి బిడ్డ పుట్టింది. అంతమాత్రాన కేసు నుంచి నిందితునికి విముక్తి కల్పించలేమని కలబురిగిలోని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.విజయపుర (బిజాపుర) జిల్లా బసవన బాగేవాడి తాలూకాకు చెందిన అనిల్‌ అదే గ్రామానికి చెందిన బాలికను అపహరించాడు. పోలీసులు అతడిని కిడ్నాప్, పోక్సో సెక్షన్ల కింద అరెస్టు చేశారు. తరువాత బాలికను అతడు బెయిల్‌పై బయటకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నాడు. కేసును కొట్టివేయాలని పిటిషన్‌ వేయగా, విచారణ కలబురిగి బెంచ్‌కు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్‌ హెచ్‌పీ సందేశ్‌ పైవిధంగా తీర్పు ఇచ్చారు.

Previous articleకాలుష్యం కంటే టీవీలో చర్చలే ఎక్కువ ప్రమాదం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ
Next articleలక్కీ డ్రా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here