పెద్దపల్లి అక్టోబర్ 05
రత్నాపూర్ గ్రామము వద్ద ఎక్స్ ప్రెస్ బస్ ఆపే బోర్డ్ మంగళవారం గ్రామం వద్ద పెట్టడం జరిగింది. ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్ ఆపడం లేదని గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ద్వారా ఆర్టీసీ అధికారులకు అందించడం జరిగింది. దీంతో బస్ ఆపాలని అధికార్లు ఉత్తర్వులు జారీ చేయగా, బోర్డ్ పెట్టడం జరిగింది. జడ్పీ చైర్మన్ పుట్ట మధుకు, ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పివీరావు, ఎంపీటీసీ ధర్ముల రాజసంపత్, ఉపసర్పంచ్ దుబ్బాక సత్యా రెడ్డి, వార్డు సభ్యులు కోవూరి సురేష్, బొంగురాల రవి, తెరాస నాయకులు బాద్రపు ప్రశాంత్ రావు, కండె కిష్టయ్య, సందెవేన కుమార్, ఉనుగొండ మధుకర్ రావు, సాగర్ల తిరుపతి, బోగె సతీష్, కొప్పుల రవీందర్ రావు,పానుగంటి ప్రశాంత్, ఒర్రె సురేష్, జక్కుల మహేష్, గుమ్మడి ప్రసాద్, బర్ల రాంనరేందర్, సింగం మహేష్, సారయ్య, కొలిపాక సత్తయ్య, దాసరి మల్లి, ముడుసు చంద్రయ్య లు పాల్గొన్నారు.