Home రాజకీయాలు జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు నాకేష్ రెడ్డి

జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నాయకులు నాకేష్ రెడ్డి

105
0

కౌతాళం
చెట్లు ప్రగతికి మెట్లు అని చెట్లు వల్ల అనేక ప్రయోజనలు ఉన్నాయని మనిషి కి ఆక్సిజన్ ఇచ్చి ఆయువును పెంచుతుందని సకాలంలో పంట పొలాలకు వర్షాలు సమకూరుస్తాయని ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పర్యావరణ మును కాపాడాలని వైసీపీ నాయకులు నాకేశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం  మండల పరిధిలోని బదినేహల్ గ్రామం నందు శివారెడ్డి కుమారులైన నాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం కు భూమి పూజలు నిర్వహించారు.  బదినేహాల్ గ్రామం నుండి ఎరిగేరి పోవు రోడ్డు ఇరువైపులా జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాకేశ్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ నాన్నగారి  ఆశయాల కోసం ప్రజలకు అందుబాటులో ఉండి మన నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వై బాల నాగ రెడ్డి గారి సహకారంతో మన బదినేహాల్ గ్రామాన్ని అభివృద్ధి చేసి మండలములోని బదినేహల్ గ్రామం ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవనం కొరకు భూమి పూజ చేయడం జరిగినదని.  మన గ్రామం నుంచి ఎరిగేరి వరకు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటడం నిర్వహించమని .గ్రామంలో ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే బలనాగి రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లి  వెంటనే పరిష్కరిస్తామని రైతులు బాగుంటేనే మనందరం బాగుంటమని  అని ఆయన పలికారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథరెడ్డి ,ప్రసన్న రెడ్డి , ముధుక రెడ్డి, శివప్ప స్వామి, గ్రామ సర్పంచ్ రామప్ప ,నజీర్ భాష కరీం భాష, మౌలా సాబ్ ,తదితరులు పాల్గొన్నారు.

Previous articleకాకాణి చేతులమీదుగా విభిన్న ప్రతిభావంతులకు సెల్ ఫోన్ల పంపిణీ – నెల్లూరు
Next article90 రోజుల్లోగా అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ:సిఎం జగన్‌మోహన్‌రెడ్డి – అమరావతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here