పెద్దపల్లి అక్టోబర్ 25
గోదావరిఖనికి చెందిన హైకోర్టు జూనియర్ న్యాయవాది అశ్రీత గాంధీకి యువ ప్రతిభ రత్న పురస్కారం లభించింది. సామాజిక సేవలోను న్యూస్ రీడర్ గాను న్యాయ సేవలోను చూపుతున్న ప్రతిభకు గుర్తింపుగా స్వాతంత్ర్య అమృత మహొత్సవం సందర్బంలో అల్ ది బెస్ట్ అకాడమీ సామాజిక అకాడమి యువ ప్రతిభా రత్న పురస్కారంను హ్తెదరాబాద్ పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డాక్టర్ నందమూరి తారక రామారావు కళా ప్రాంగణంలో ఈ పురస్కారాన్ని అశ్రీత గాంధీకి రాష్ట్ర మానవ హక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య చేతుల మీదుగా అందచేశారు. జస్టిస్ తో పాటుగా ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శర్మ, కూచిపూడి నాట్య గురువు డాక్టర్ ఎస్పీ భారతి, అకాడమి బాధ్యులు డాక్టర్ ఇ ఎస్ సూర్య నారాయణ మాస్టర్, సూర్య తేజ సుబ్రాంత్ లు ఉన్నారు. అశ్రీత గాంధీ ముందడుగు వారు అభినందించారు. కాగా ఈ యువ ప్రతిభ రత్న పురస్కారంను అందుకున్న అశ్రీత గాంధీకి గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలొని పలు పక్షాలు శుభాకాంక్షలు తెలిపాయి.