గుడివాడ
కృష్ణాజిల్లా గుడివాడ రైల్వే స్టేషన్ వద్ద మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఘర్షణ పడిన నేపధ్యంలో బత్తుల సాయికుమార్ అనే యువకుడు మృతి చెందాడు. పట్టణానికి చెందిన రాపానీ ఏసు,బత్తుల సాయికుమార్ లు రైల్వే స్టేషన్ సమీపంలో
గురువారం రాత్రి కలిసి మద్యం సేవించారు. చిన్న విషయమే ఇద్దరికీ మాట మాట పెరుగి ఘర్షణ కు దారితీయగా, సాయి కుమార్ పై, ఎసు గొడ్డలితో దాడి చేశాడు. 108 వాహనం ద్వారా సాయికుమార్ ముగ్గురు కూడా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి
తీసుకువెళ్లగా, పరిస్థితి విషమించడంతో, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వైద్యులు విజయవాడ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయికుమార్ మెడపై అయినా తీవ్ర గాయం కారణంగా మృతి చెందాడు. కేసు నమోదు చేసిన
గుడివాడ టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.