జగిత్యాల అక్టోబర్ 25
జగిత్యాల స్థానిక విరుపాక్షి గార్డెన్ల్లో ఆదివారం రాత్రి జగిత్యాల జిల్లా రాఘవపట్నానికి చెందిన ప్రముఖ హాస్యనటుడు, జబర్దస్త్ ఫేం ముక్కు అవినాష్, అంజన ల వివాహా పరిచయ కార్యక్రమం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. వేద పండితుల ఆశీర్వాదం తో ప్రముఖుల అభినందలతో వైభవంగా సాగింది.
ప్రముఖ హాస్య నటులు చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రాకేష్, తాగుబోతు రాజమౌళి, రమేష్ లతో సందడి నెలకొంది. వారితో సెల్ఫీ లు దిగేందుకు పిల్లలు మహిళలు ఆసక్తి చూపారు.
ఈ కార్యక్రమంలో కళాశ్రీ అధినేత గుండేటి రాజు, డాక్టర్ మోర రోజా సుమన్, మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, మిష్టర్ తెలంగాణ సయ్యద్ షావేర్, పాత్రికేయులు సంపూర్ణ చారి, బానుక శ్రీనివాస్, కందుకూరి నాగరాజు,
తదితరులు హాజరయ్యారు.