నెల్లూరు
నెల్లూరు పార్లమెంటరీ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డిని, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక మినీ బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న ఆదాల నివాసంలో కుటుంబ సమేతంగా గా పూల బొకే తో లాంఛనంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి మరియు జిల్లా పార్టీ సీనియర్ నేతలు సహాయ సహకారాలతో నే తనకు జెడ్పి చైర్ పర్సన్ పదవి లభించిందని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎంతో నమ్మకంతో అప్పగించిన పదవీ బాధ్యతలు నెరవేరుస్తూ, పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈమె వెంట తన భర్త అయిన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ ఆనం జయకుమార్ రెడ్డి పాల్గొని ఆదాలను కలిశారు.ఆనం కార్తికేయ ఎంపీని శాలువాతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు . ఈ సందర్భంగా విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.