నెల్లూరు
నెల్లూరు జిల్లా ,
ఉదయగిరి శాసన సభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని మర్రిపాడులోని ఆయన స్వగృహంలో నెల్లూరు జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు షేక్ గాజుల తాజుద్దీన్ కలసి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులుగా హైకమాండ్కు సిఫార్సు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి ఆశీస్సులు కోరుతూ దుశ్శాలువతో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎల్లప్పుడూ తన ఆశీస్సులు ఉంటాయని ,ఉదయగిరి ప్రజలకు సేవలు చేయడానికి కృషి చేయాలని సూచించారు. ఈసందర్భంగా ఆయన సోదరులు, రాజకీయ సీనియర్ నేత మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ,రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి, జిల్లా స్థానిలో తన ఎన్నిక చేసిన హైకమాండ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. పైకార్యక్రమంలో నెల్లూరు జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ చలమారెడ్డి ,ఉదయగిరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ అక్కిభాస్కర్ రెడ్డి ,జనవిజ్ఞానవేదిక నెల్లూరుజిల్లా గౌరవ అధ్యక్షుడు దస్తగిరి అహ్మద్ ,వైసీపీ నేత బకీరు ఆనందరావు షేక్ గాజుల నజిమోహిద్దీన్ ,రంతుజాని తదితరులు పాల్గొన్నారు.
Home ఆంధ్రప్రదేశ్ ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటికి కృతజ్ఞలు తెలిపిన జడ్పీ కో ఆప్షన్ సభ్యులు గాజుల తాజుద్దీన్