లక్నో నవంబర్ 8
ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జికా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా 89 మంది ఆ వైరస్ పరీక్షలో పాజిటివ్ తేలారు. వారిలో 17 మంది చిన్నారులు ఉన్నట్లు వైద్యశాఖ తెలిపింది. 2015లో బ్రెజిల్‌లో జికా విజృంభణ వల్ల వేలాది మంది చిన్నారులు మైక్రోసెఫాలీ వ్యాధితో పుట్టారు. ఈ వ్యాధి వల్ల శిశువులు చిన్నసైజు తలతో ఉంటారు. వారిలో మెదడు కూడా సరిగా డెవలప్ కాదు. జికా కేసుల సంఖ్య పెరుగుతోందని, అనేక వైద్య బృందాలు వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కన్పూర్ జిల్లా మెడికల్ చీఫ్ ఆఫీసర్ డాక్టర్ నేపాల్ సింగ్ తెలిపారు. పారిశ్రామిక నగరం కాన్పూర్‌లో తొలిసారి అక్టోబర్ 23న జికా కేసును గుర్తించారు. ఆ తర్వాత అక్కడ కేసుల సంఖ్య పెరుగుతూపోతోంది.